Vaibhav Suryavanshi: దక్షిణాఫ్రికా పర్యటనలో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు
- ఆయుష్ మాత్రే గైర్హాజరీలో తొలిసారి సారథ్య బాధ్యతలు
- యూత్ వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు
- 14 ఏళ్ల వయస్సులో ఈ ఫీట్ అందుకున్న వైభవ్
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ అండర్-19 జట్టు, మూడు యూత్ వన్డేల సిరీస్‌ను వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో, నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. ఇందులో వైభవ్ సూర్యవంశీ 74 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 127 పరుగులు సాధించాడు.
ఈ సెంచరీతో వైభవ్ ఒక ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆయుష్ మాత్రే గైర్హాజరీలో తొలిసారిగా సారథ్య బాధ్యతలు చేపట్టిన సూర్యవంశీ, యూత్ వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన అండర్-19 కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కేవలం 14 సంవత్సరాల వయస్సులోనే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు వైభవ్, ఆరోన్ మొదటి వికెట్‌కు 227 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.