KTR: ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

KTR Angered Over Ministers in Khammam District
  • జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపణ
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు సర్పంచ్ ఎన్నికలు జరిగాయని వెల్లడి
  • బీఆర్ఎస్ 40 శాతం సర్పంచ్‌లను గెలుచుకుందని వెల్లడి
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖమ్మంలో నిర్వహించిన సర్పంచ్‌ల సన్మాన కార్యాక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిగాయని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం సర్పంచ్‌లను బీఆర్ఎస్ గెలుచుకుందని గుర్తు చేశారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్పించే పనిలో ఉన్నారని ఆరోపించారు.
KTR
KTR BRS
KTR Khammam
BRS Party
Khammam District
Telangana Politics
Congress Party

More Telugu News