Prabhas: 'ది రాజాసాబ్' టికెట్ ధర భారీగా పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- రేపు సాయంత్రం 6 గంటలకు 'ది రాజాసాబ్' ప్రీమియర్లు
- ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 1000
- సింగిల్ స్క్రీన్లలో రూ. 150, మల్టీప్లెక్సుల్లో రూ. 200 వరకు పెంచుకునే అవకాశం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ సినిమా ప్రీమియర్లు రేపు సాయంత్రం పడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలకు, టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ షోలు పడతాయి.
ప్రీమియర్ షోలకు టికెట్ ధర రూ. 1000గా ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చారు. జనవరి 9 నుంచి మొదటి 10 రోజులు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో టికెట్ పై రూ.200 వరకూ పెంచుకునేలా ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.350 - రూ.400, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.450 -550 వరకూ ఉండనున్నాయి. రోజుకు 5 షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు.
మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ హారర్ ఫాంటసీ కామెడీలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక రోల్‌లో కనిపిస్తారు. తమన్ మ్యూజిక్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.