Sumathi: రూ.1 లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అధికారులు

Rangareddy District Officials Caught by ACB While Taking Rs 1 Lakh Bribe
  • ఏసీబీకి చిక్కిన నందిగామ ఎంపీడీవో, ఏపీవో, ఈదులపల్లి కార్యదర్శి
  • ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.3.5 లక్షలు డిమాండ్ చేసిన అధికారులు
  • రెండోసారి రూ.1 లక్ష చెల్లిస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
రంగారెడ్డి జిల్లా నందిగామ ఎంపీడీవో కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. భవన నిర్మాణానికి సంబంధించి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఎంపీడీవోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నందిగామ మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామంలో బొబ్బిలి ప్రవీణ్ అనే వ్యక్తి చేపట్టిన భవన నిర్మాణానికి ఎంపీడీవో సుమతి, ఏపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి కార్యదర్శి చెన్నయ్యలు రూ.3.5 లక్షల లంచం డిమాండ్ చేశారు.

బాధితుడు ప్రవీణ్ గతంలో రూ.1 లక్ష చెల్లించాడు. మిగిలిన సొమ్ము కోసం అధికారులు తన నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎంపీడీవో కార్యాలయంలో మరో రూ.1 లక్ష లంచం ఇస్తుండగా ముగ్గురినీ ఏసీబీ డీఎస్పీ పట్టుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sumathi
Rangareddy district
Nandigama MPDO
ACB raid
Bribery case
Corruption
Telangana

More Telugu News