ఖాన్‌లకు, కపూర్‌లకు సాధ్యంకాని రికార్డును సాధించిన 'ధురంధర్'

  • బాక్సాఫీసును షేక్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్'
  • రూ. 1,200 కోట్లు దాటిన కలెక్షన్లు
  • మార్చిలో విడుదల కానున్న 'ధురంధర్ 2'

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. డిసెంబర్ 2025లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికే ఐదో వారంలోకి అడుగుపెట్టింది. అయినా వసూళ్ల జోరు తగ్గడం లేదు.


భారత్‌లో నెట్ కలెక్షన్స్ రూ. 831.40 కోట్లకు చేరాయి. హిందీ సినిమాల చరిత్రలోనే అత్యధికంగా... ఖాన్‌లకు, కపూర్‌లకు సాధ్యం కాని రికార్డును 'ధురంధర్' సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1,222 కోట్లు దాటేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, 30 రోజులు పూర్తయినా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు వేస్తోంది.


సౌదీ, యూఏఈ వంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో బ్యాన్ అయినా ఈ రేంజ్ వసూళ్లు రావడం ఆశ్చర్యం. అమెరికా, కెనడాలో 'RRR', 'జవాన్', 'కల్కి' వంటి సినిమాలను దాటేసింది. 'బాహుబలి 2' రికార్డుకు చేరువలో ఉంది. మరోవైపు, 'ధురంధర్ 2' మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



More Telugu News