AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు... కోర్టుకు చేరిన ఎఫ్ఎస్ఎల్ కీలక నివేదిక
- నిందితుల మొబైల్ ఫోన్ల నుంచి డిజిటల్ ఆధారాల సేకరణ
- ఫోరెన్సిక్ నివేదికను సిట్ అధికారులు తీసుకునే అవకాశం
- పెద్ద పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల మొబైల్ ఫోన్ల నుంచి సేకరించిన డిజిటల్ ఆధారాలపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నివేదిక కోర్టుకు చేరింది. ఈ నివేదికను సిట్ అధికారులు తీసుకునే అవకాశం ఉంది.
స్కామ్ బయటపడిన వెంటనే చాలా మంది నిందితులు తమ మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని, రీసెట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆధునిక ఫోరెన్సిక్ సాంకేతికతతో డిలీట్ అయిన డేటా, కాల్ రికార్డులు, చాట్స్, ఫైల్స్‌ను రికవరీ చేసినట్టు సమాచారం. ఈ రికవరీ డేటాలో ఏం ఉందో తెలిస్తే కేసు మరింత లోతుగా సాగే అవకాశం ఉంది.
ఈ రిపోర్ట్ సిట్ చేతికి అందితే... ఆర్థిక లావాదేవీలు, రాజకీయ నాయకులతో సంబంధాలు, లంచాలకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి రావచ్చు. దీంతో ఇప్పటికే నిందితులుగా ఉన్నవారితో పాటు మరికొందరి పెద్ద పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నివేదికలో ఏం బయటపడుతుందోనని రాజకీయ నాయకులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.