Chandrababu: పోలవరం పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష... నిర్వాసితులపై పూర్తి ఫోకస్ పెట్టాలని ఆదేశం

Chandrababu reviews Polavaram project focuses on evacuees
  • మిగిలిన పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం
  • నిర్వాసితుల పునరావాసంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సూచన
  • ఆర్ అండ్ ఆర్ పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్న సీఎం
  • మే మొదటి వారంలో మళ్లీ పనులను పరిశీలిస్తానని వెల్లడి
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై దృష్టి సారించారు. బుధవారం ఆయన ప్రాజెక్టు సైట్ వద్ద జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులో మిగిలిన పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టులో ఇప్పటికే 87 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు.

అదేవిధంగా పోలవరం ఎడమ కాలువ పనులను వేగవంతం చేయాలని సీఎం తెలిపారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతానికి కూడా నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కీలక సూచన చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే మే నెల మొదటి వారంలో తాను మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేస్తానని చంద్రబాబు వెల్లడించారు.
Chandrababu
Polavaram project
Andhra Pradesh
Irrigation project
Polavaram left canal
Polavaram right canal
Resettlement
R and R package
Kolleru lake
AP irrigation

More Telugu News