Revanth Reddy: ఖమ్మంలో బీఆర్ఎస్‌కు మరో షాక్.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు

Revanth Reddy Welcomes BRS Corporators into Congress in Khammam
  • ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు
  • తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి
ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. ఈరోజు మరో ముగ్గురు కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కార్పొరేటర్లు ధనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు సీహెచ్ లక్ష్మీ, జి. చంద్రకళ, డి. సరస్వతి, అమృతమ్మ, ఎం.శ్రావణి కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Revanth Reddy
Khammam
BRS
Congress Party
Telangana Politics
Tumala Nageswara Rao
Corporators

More Telugu News