Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి సోదరుడికి సిట్ నోటీసులు

Revanth Reddy Brother Kondal Reddy Gets SIT Notice in Phone Tapping Case
  • తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు
  • రేపు విచారణకు రావాలంటూ కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
  • బీఆర్ఎస్ హయాంలో కొండల్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్టు దర్యాప్తులో తేలిన వైనం

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత సోదరుడు కొండల్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నోటీసులు పంపింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో అధికారులు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి విపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో కొండల్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేశారని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన వాంగ్మూలం తీసుకోవడం కోసం విచారణకు పిలుస్తున్నారు.


ఇదే కేసులో మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలకూ నోటీసులు వెళ్లాయి. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను కూడా రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావులకు కూడా ఇలాంటి నోటీసులు జారీ అయ్యాయి.

Revanth Reddy
Telangana phone tapping case
Kondal Reddy
SIT investigation
BRS leaders
Jaipal Yadav
Chirumurthy Lingaiah
Naveen Rao
Madhava Krishna Rao

More Telugu News