ప్రతి పరిచయం వెనుక ఒక పరమార్థం వుంటుంది: సాయికుమార్

  • శంబాల మూవీ థ్యాంక్స్ మీట్‌లో మాట్లాడిన సాయి కుమార్
  • విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో పక్క సీటులో వారి ఫోన్ నెంబర్ తీసుకుంటానన్న సాయి కుమార్
  • అనేక మంది ప్రముఖులు ఫ్లైట్‌లో పరిచయం అయ్యారని వెల్లడి  
ప్రతి పరిచయం వెనక ఒక పరమార్థం ఉంటుందని నటుడు సాయి కుమార్ అన్నారు. ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శంబాల మూవీ విజయోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్‌లో సాయి కుమార్ మాట్లాడారు. 

తాను విమానాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కచ్చితంగా పక్కవారిని పరిచయం చేసుకుని వారి ఫోన్ నెంబర్ తీసుకుంటానని సాయి కుమార్ తెలిపారు. ఆ తర్వాత రోజు ఉదయం నుంచే ఆ పరిచయం చేసుకున్న వారితో సంభాషణలు చేస్తూ ఉంటానన్నారు. ఇలా తనకు ఎంతో మంది ప్రముఖులు ఫ్లైట్‌లో పక్క సీట్లో పరిచయం అయ్యారని చెప్పారు. ప్రతి పరిచయం వెనుక ఒక పరమార్థం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.  



More Telugu News