Operation Sindoor: భారత సైన్యం దెబ్బకు అప్పుడు అమెరికాకు పరుగుపెట్టిన పాకిస్థాన్... 50కి పైగా సమావేశాలు!

Operation Sindoor Pakistan lobbying efforts with US revealed
  • ఆపరేషన్ సిందూర్ కోసం అమెరికాతో పాక్ లాబీయింగ్ కోసం ప్రయత్నం
  • ప్రభుత్వాధికారులు, చట్ట సభ్యులు, మీడియా సంస్థలతో 50కి పైగా సమావేశాలు
  • భారత సైనిక చర్యను ఆపే లక్ష్యంతో వాషింగ్టన్ జోక్యం కోసం షెహబాజ్ ప్రయత్నం
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ అమెరికాతో లాబీయింగ్ కోసం ప్రయత్నించింది. ఈ మేరకు 50కి పైగా సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. యూఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద దాఖలైన పత్రాలను ఉటంకిస్తూ ఓ జాతీయా మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా ప్రభుత్వాధికారులు, చట్ట సభ్యులు, మీడియా సంస్థలతో పాక్ బృందాలు 50కి పైగా సమావేశాలు జరిపినట్లు సమాచారం. 60 మంది అధికారులు, మధ్యవర్తులకు ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ చేశాయి. అమెరికా అధికారులతో వ్యక్తిగత సమావేశాలు కూడా నిర్వహించాయి. భారత సైనిక చర్యను ఆపే లక్ష్యంతో వాషింగ్టన్ జోక్యం చేసుకునేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన ఈ సమావేశాల్లో కశ్మీర్ అంశం, ప్రాంతీయ భద్రత, అరుదైన ఖనిజాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. లాబీయింగ్ కోసం ఆ దేశం భారీగా ఖర్చు చేసిందని, ఆపరేషన్ సిందూర్ జరిగిన సమయంలో ఆ మొత్తం భారీగా పెరిగిందని అమెరికాలోని ఓ ప్రముఖ మీడియా సంస్థ పరిశోధనలో తేలినట్లు వెల్లడించింది. ట్రంప్ యంత్రాంగానికి మరింత చేరువయ్యేందుకు దౌత్య, వాణిజ్యపరమైన అంశాల్లో అనుకూల ఫలితాలు పొందేందుకు లాబియింగ్ సంస్థలతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
Operation Sindoor
Pakistan
United States
India
Indian Army
Kashmir
Shehbaz Sharif

More Telugu News