Virat Kohli: కోహ్లీ పోరాడకుండానే వదిలేశాడు: మంజ్రేకర్ ఆవేదన
- గత ఏడాది టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న కోహ్లీ
- ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ వైనం
- ఫామ్ కోసం పోరాడలేదన్న మంజ్రేకర్
భారత క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ గతేడాది టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ షాక్‌లో ముంచెత్తడం తెలిసిందే. 123 టెస్టుల్లో 9,230 రన్స్, 30 శతకాలతో అద్భుత టెస్టు కెరీర్‌ను ముగించాడు. ఫ్యాబ్-4 (కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్)లో ఒకడిగా టెస్టుల్ని ఆదరించిన విరాట్ ఇలా ఊహించని విధంగా వీడ్కోలు చెప్పడం చాలామందిని బాధపెట్టింది. కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకడంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"కోహ్లీ చాలా సులభంగా వీడ్కోలు చెప్పేశాడు. ముందు ఐదేళ్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. సగటు 31కి పడిపోయింది. కానీ ఆ సమస్యలు ఎందుకు వచ్చాయో లోతుగా ఆలోచించి సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు" అని మంజ్రేకర్ అన్నాడు.
క్రికెట్ ను కోహ్లీ ఎంత ప్రేమిస్తాడో అందరికీ తెలుసు అని చెప్పారు. విరాట్ ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ, మళ్లీ ఫామ్ కోసం పోరాడకుండా వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.