Uttar Pradesh Elections: యూపీలో 'ఎస్ఐఆర్'.. వివిధ కారణాలతో 2.8 కోట్ల ఓట్ల తొలగింపు
- 15.44 కోట్ల నుంచి ఎస్ఐఆర్ తర్వాత 12.56 కోట్లకు తగ్గిన ఓటర్లు
- శాశ్వత వలస, మరణాలు, ఒకటి కంటే ఎక్కువ చోట రిజిస్ట్రేషన్ల ఓటర్ల తొలగింత
- అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించవచ్చన్న అధికారులు
ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 15.44 కోట్ల మంది ఓటర్లలో 2.8 కోట్ల మంది ఓటర్లను తొలగించినట్లు ఈసీ తెలిపింది. శాశ్వతంగా వలసపోయిన వారు, మరణించిన వారు, బహుళ రిజిస్ట్రేషన్లు వంటి కారణాల వల్ల ఈ తొలగింపులు జరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా తెలిపారు. ప్రస్తుతం 12.55 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితాలో కొనసాగించినట్లు ఆయన వెల్లడించారు.
తొలగించిన 2.89 కోట్ల మందిలో 46 లక్షల మంది మరణించారని, 2.17 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారని, 25.47 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువచోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు.
ప్రత్యేక సమగ్ర సవరణకు ముందు ఉత్తరప్రదేశ్‌లో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వివిధ కారణాల వల్ల ఓటర్ల తొలగింపుల అనంతరం ఆ సంఖ్య 12.56 కోట్లకు తగ్గింది. ఓటర్లు తమ పేరు ముసాయిదా జాబితాలో ఉందో లేదో యాప్ ద్వారా లేదా ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాల్లో అభ్యంతరాలను స్వీకరిస్తామని, వాటిని పరిష్కరించిన తర్వాత తుది జాబితాను మార్చి 6న విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.