Meenakshi Chaudhary: నాకు ఇప్పుడు అర్థమైంది: మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary Interview
  • వరుస హిట్లతో ఉన్న మీనాక్షి
  •  తాను చాలా లక్కీ అంటూ వెల్లడి 
  • ఈ సంక్రాంతికి వస్తున్న 'అనగనగా ఒక రాజు'
  • హిట్ కొట్టడం పక్కా అంటూ వ్యాఖ్య 

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం .. హిట్ కొట్టడం .. యూత్ హృదయాలను గెలుచుకోవడం అంత ఆషా మాషీ విషయమేం కాదు. హీరోయిన్స్ గ్లామర్ పరంగా ఆడియన్స్ దృష్టిని ఒక రేంజ్ లో ఆకర్షించాలి. ఆ తరువాత పాత్ర పరంగా తమ అభినయంతో ఆకట్టుకోవాలి. ఆ సినిమా విజయాన్ని సాధించాలి. అప్పుడే కెరియర్ పరంగా ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అలా అన్ని వైపుల నుంచి మంచి మార్కులు కొట్టేసిన కథానాయికగా మీనాక్షి చౌదరి కనిపిస్తుంది. 

మీనాక్షి చౌదరి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అనగనగా ఒక రాజు' సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలో దిగిపోనుంది. నవీన్ పోలిశెట్టి జోడీగా ఆమె నటించిన సినిమా ఇది. గత ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి, ఈ ఏడాది మరో సినిమాతో రంగంలోకి దిగుతుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో ఆమె బీజీగా ఉన్నారు. 

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో గోదావరి జిల్లాలలో సంక్రాంతి ఎలా జరుగుతుందనేది నాకు అర్థమైంది. అలాగే ఈ ప్రాంతంలో సినిమాల పట్ల ఎంత క్రేజ్ ఉంటుందనేది కూడా నేను గమనించాను. కొన్ని రకాల స్వీట్స్ కి గోదావరి  జిల్లాలు స్పెషల్ అని అర్థమైంది. ప్రతి సంక్రాంతికి నా సినిమా వస్తుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. 'అనగనగా ఒక రాజు' హిట్ అవుతుందనే నమ్మకం బలంగా ఉంది" అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Meenakshi Chaudhary
Anaganaga Oka Raju
Sankranthi Ku Vasthunnam
Naveen Polishetty
Telugu cinema
Tollywood
movie promotions
actress
Godavari districts
Sankranthi festival

More Telugu News