Sravanthi Ravikishore: 'మహర్షి' మామూలు దెబ్బకొట్టలేదు: నిర్మాత స్రవంతి రవి కిశోర్!

Sravanthi Ravi Kishore Interview
  • 1987లో వచ్చిన 'మహర్షి'
  • పాప్యులర్ అయిన పాటలు
  • 35 లక్షలు పెట్టామన్న నిర్మాత 
  • 9 లక్షలు మాత్రమే వచ్చాయని వెల్లడి  

ఇల్లు కట్టి చూడు .. పెళ్లి చేసి చూడు అనే నానుడి మనం ఎక్కువగా వింటూ ఉంటాము. అయితే 'సినిమా తీసి చూడు' అనే మాట కూడా మనకి ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయితే, ఆ సినిమా తీసిన నిర్మాత ఎవరూ ఆదుకోలేని స్థాయిలో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి దెబ్బ నుంచి తాను కూడా తప్పించుకోలేకపోయానని, ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత స్రవంతి రవికిశోర్ చెప్పారు. 

"వంశీ దర్శకత్వంలో నేను 'లేడీస్ టైలర్' సినిమాను నిర్మించాను. ఆ సినిమా చాలా బాగా ఆడింది. నాపై నాకు నమ్మకాన్ని కలిగించిన సినిమా ఇది. దాంతో ఆ తరువాత వంశీతో 'మహర్షి' సినిమాను నిర్మించాను. సినిమా మొదలు పెట్టడానికి ముందే ఇళయరాజాగారితో పాటలన్నీ రికార్డు చేయించాము. 17 -18 లక్షలలో ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నాను. కానీ సినిమా పూర్తయ్యే సమయానికి 35 లక్షలు ఖర్చు చేయవలసి వచ్చింది" అని అన్నారు. 

ఇళయరాజా గారు స్వరపరిచిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ సినిమా పాటలు వినిపిస్తూ ఉంటాయి. పాటలు చాలా పాప్యులర్ అయ్యాయి. అయితే ఆశించిన స్థాయిలో సినిమా ఆడలేదు. 35 లక్షలు ఖర్చు చేస్తే, ఈ సినిమా మీద వచ్చింది కేవలం 9 లక్షలు మాత్రమే. అంతగా ఈ సినిమా నష్టాలు తీసుకొచ్చింది. చాలాకాలం తరువాత తీయవలసిన సినిమాను ముందుగా తీయడం వల్లనే ఈ కథ కనెక్ట్ కాలేదని అనిపించింది" అని చెప్పారు. 

Sravanthi Ravikishore
Maharshi movie
Ladies Tailor movie
Vamsee director
Ilayaraja music
Telugu cinema
Movie production loss
Tollywood
Movie industry
Film finance

More Telugu News