Hardik Pandya: అమితాబ్‌కు తన గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా.. ఇదిగో వీడియో!

Hardik Pandya Introduces Girlfriend to Amitabh Bachchan Video
  • ముంబైలో జరిగిన రిలయన్స్ ఫౌండేషన్ ఈవెంట్‌లో సందడి చేసిన హార్దిక్ పాండ్యా
  • తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మను అమితాబ్ బచ్చన్‌కు పరిచయం చేసిన హార్దిక్
  • క్రికెట్, సినీ ప్రముఖుల మధ్య  ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఘ‌ట‌న‌
  • రెడ్ కార్పెట్‌పై చేతిలో చేయి వేసి నడిచివచ్చిన జంట
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మతో కలిసి సందడి చేశాడు. ఈవెంట్‌లో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఆమెను పరిచయం చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' పేరుతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. భారత పురుషుల, మహిళల, అంధుల మహిళల క్రికెట్ జట్ల ప్రపంచకప్ విజయాలకు గుర్తుగా ఈ వేడుకను నిర్వహించారు. నీతా అంబానీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడా, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌కు హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ జంటగా విచ్చేశారు. రెడ్ కార్పెట్‌పై చేతిలో చేయి వేసుకుని నడుస్తూ ఫొటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించారు. స్టైలిష్ సూట్‌లో హార్దిక్, సొగసైన దుస్తుల్లో మహీక మెరిసిపోయారు. ఈవెంట్ లో అమితాబ్ బచ్చన్‌కు హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేస్తున్న దృశ్యాలు ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

క్రికెట్ విజయాల సంబరాల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పరిణామం ప్రత్యేకంగా మారింది. ఈ జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Hardik Pandya
Mahikaa Sharma
Amitabh Bachchan
Reliance Foundation
Nita Ambani
United in Triumph
Mumbai Event
Bollywood
Cricket
Indian Cricket Team

More Telugu News