Nepal: నేపాల్ సరిహద్దుల్లో ఉద్రిక్తత... భారత్ అప్రమత్తం
- నేపాల్ లో మత ఘర్షణలు
- ఒక ప్రార్థనా స్థలంపై కొందరి దాడి
- పలు ప్రాంతాల్లో ఆందోళనకారుల నిరసన
- అప్రమత్తమైన భారత ప్రభుత్వం
- నేపాల్ సరిహద్దులు మూసివేత
హిమాలయ దేశం నేపాల్‌లో మతపరమైన ఘర్షణలు చెలరేగాయి. ధనుశా జిల్లాలో ఒక ప్రార్థనా స్థలంపై కొందరు దాడికి పాల్పడి, ధ్వంసం చేశారు. దీనిని సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆందోళనలు చెలరేగాయి. రాహౌల్, పర్సా ప్రాంతాల్లో ఆందోళకారులు నిరసనలకు దిగారు.
ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెద్ద సంఖ్యలో భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. కొన్ని చోట్ల పరిస్థితి హింసాత్మకంగా మారడంతో స్థానిక యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. నేపాల్ తో సరిహద్దును మూసేసింది. ఎమర్జెన్సీ సేవలు మినహా, రాకపోకలను బంద్ చేసింది.