ఎలాగైనా ఆ రోజులు వేరు: సాయికుమార్ బ్రదర్!

  • నాటక రంగం నుంచి వచ్చిన పీజే శర్మ 
  • ఆయన వారసులుగా సాయికుమార్, రవి, అయ్యప్ప 
  • డబ్బింగ్ తో గుర్తింపు పొందిన బ్రదర్స్
  • చెన్నై రోజులను గుర్తుచేసుకున్న అయ్యప్ప  
     
 పాత సినిమాలతో ఎక్కువగా పరిచయం ఉన్నవారికి పీజే శర్మ ను గురించి గుర్తు చేయవలసిన అవసరం లేదు. అప్పట్లోనే వాయిస్ పరంగా మంచి గుర్తిమ్పు ఉన్న నటులు ఆయన. ఆ తరువాత కాలంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన వారసులుగా  సాయికుమార్ .. రవికుమార్ .. అయ్యప్ప పి శర్మ కూడా, నటులుగా .. డబ్బింగ్ కళాకారులుగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నవారే. 

తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్యప్ప పి శర్మ మాట్లాడుతూ, " మా నాన్నగారు వాళ్లది విజయనగరం. నటుడు కావాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి వచ్చారు. శ్రీ శ్రీ గారు .. ఆరుద్రగారు .. సోమయాజులు గారు .. రమణమూర్తి గారు .. ఇలా చాలామంది విజయనగరం నుంచి వచ్చినవారే. అప్పట్లో అందరూ నాటకాల కోసం కలిసి పనిచేసినవారే. ఆ తరువాత సినిమాల పట్ల గల ఆసక్తితో ఇక్కడికి రావడం .. ఇక్కడి కష్టాలను తట్టుకుని నిలబడటం జరిగింది" అని అన్నారు.

చెన్నై లో సినిమా వాళ్లంతా ఒక్క దగ్గరే ఉండేవారు. అలా అందరం ఒక చోట ఉండేలా చూసుకుని ఇళ్లు కొనుక్కోవడం .. కట్టుకోవడం జరిగింది. ఒక వైపున నాటకాలు . మరో వైపున సినిమాలు నడుస్తూ ఉండేవి. రిహార్సల్స్ కూడా చాలా సందడిగా జరుగుతూ ఉండేవి. ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ సాయంత్రం అందరం ఒక చోటున కలుసుకుని సరదాగా మాట్లాడుకునే వాళ్లం. నిజంగా ఆ రోజులు ఎంతో హ్యాపీగా గడిచిపోయాయి.  మళ్లీ అలాంటి రోజులు రావు కదా" అని అన్నారు. 



More Telugu News