Vijay Deverakonda: విజయ్ దేవరకొండ చిన్నప్పటి నుంచి అంతే!: మేనమామ యశ్ రంగినేని

Yash Rangineni Interview
  • విజయ్ ఎవరి మాటా వినడన్న యశ్ రంగినేని
  • నిర్ణయాలు తానే తీసుకుంటాడని వెల్లడి 
  • తనని ద్వేషించేవారు కూడా ఎక్కువేనని వ్యాఖ్య
  • సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుందనే అభిప్రాయం 

నిర్మాతగా కొనసాగుతూనే నటుడిగా కూడా తన ప్రత్యేకతను చాటుకోవడానికి యశ్ రంగినేని ప్రయత్నిస్తున్నారు. రీసెంటుగా 'ఛాంపియన్' సినిమాలో ఆయన చేసిన 'వీరయ్య' పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. విజయ్ దేవరకొండకి ఆయన స్వయానా మేనమామ. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"విజయ్ ఎవరి మాటలను వినిపించుకోడు .. మొదటి నుంచి కూడా అంతే. వాళ్ల అమ్మమాట గానీ .. నాన్నమాట గాని వినడు. చాలా కాలం వరకూ నేను దూరంగా ఉండటం వలన, విజయ్ గురించి మా చెల్లెలు చెబుతూ ఉంటే వింటూ ఉండేవాడిని. ఆ తరువాత నుంచి అతణ్ణి నేను దగ్గరగా చూస్తూ వస్తున్నాను. మంచి అయినా .. చెడు అయినా ఆ పని చేయడంలో సందేహించడు. చాలా క్లారిటీతో ఉంటాడు. ఒక నిర్ణయమంటూ తీసుకుంటే దానిని ఆచరణలో పెడతాడు" అని అన్నారు. 

"విజయ్ తన వ్యక్తిగతమైన .. వృత్తి పరమైన నిర్ణయాలను కూడా తానే తీసుకుంటాడు. ఆ విషయంలో ఎలాంటి తడబాటు మనకి కనిపించదు. విజయ్ ను అభిమానించేవారు ఎంతమంది ఉన్నారో .. ద్వేషించేవారు అంతేమంది ఉన్నారు. అందువలన అతను మున్ముందు మరిన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లవలసి ఉంటుంది. తన భవిష్యత్తు బాగుండాలనే నేను కోరుకునేది" అని చెప్పారు. 

Vijay Deverakonda
Yash Rangineni
Champion Movie
Telugu Cinema
Tollywood
Producer
Actor
Veerayya Character
Suman TV Interview
Telugu News

More Telugu News