AR Rahman: రెహమాన్ బర్త్‌డే గిఫ్ట్.. ‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్లకు చెక్

Peddi Movie Release Date Fixed as Birthday Gift to AR Rahman
  • ఏఆర్ రెహమాన్ పుట్టినరోజున చిత్రబృందం ప్రత్యేక విషెస్
  • రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై స్పష్టత
  • మార్చి 27న విడుదల అని మరోసారి ప్రకటించిన మేకర్స్
  • వాయిదా పడుతుందన్న వార్తలకు ఫుల్‌స్టాప్
  • ‘చికిరి చికిరి’ ఆరంభం మాత్రమేనన్న చిత్ర యూనిట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు చిత్రబృందం తెరదించింది. ముందుగా ప్రకటించినట్లే మార్చి 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. దీంతో సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లయింది.

సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రకటన చేసింది. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో రెహమాన్ సంగీత మాయాజాలం మరింతగా అలరించనుందని పేర్కొంది. ఆయన సంగీతం సినిమాకు ప్రధాన బలమని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది.

‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్రామీణ క్రీడా నేపథ్య రివేంజ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వాములుగా ఉన్నాయి.

‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘పెద్ది’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో విడుదల తేదీపై మేకర్స్ మరోసారి క్లారిటీ ఇవ్వడంతో సినిమాపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది.
AR Rahman
Ram Charan
Peddi Movie
Buchi Babu Sana
Janhvi Kapoor
Shiva Rajkumar
Telugu Cinema
Release Date
Chikiri Chikiri Song
Vriddhi Cinemas

More Telugu News