Japan Earthquake: భారీ భూకంపానికి చిగురుటాకులా వణికిన జపాన్​.. వీడియో ఇదిగో!

Japan Earthquake Shakes Buildings in Shimane Prefecture
  • రిక్టర్ స్కేలుపై 6.2 పాయింట్ల తీవ్రత నమోదు
  • ఊగిపోయిన భవనాలు, మెట్రో రైల్ స్టేషన్లు
  • ప్రాణనష్టం జరగలేదని అధికారుల వెల్లడి
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. మంగళవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించింది. చుగోకు రీజియన్ లోని షిమానే ప్రిఫెక్చర్ లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలు తీవ్రంగా ఉన్నాయని, ఇంత భారీ భూకంపం సంభవించినా ప్రాణనష్టం మాత్రం జరగలేదని వారు వివరించారు.

భూకంపానికి సంబంధించి పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు భయానకంగా ఉన్నాయి. ఒక వీడియోలో మెట్రో రైల్వే స్టేషన్, చుట్టుపక్కల భవనాలు తీవ్రంగా కదలడం కనిపిస్తోంది.

భూకంప కేంద్రం భూమి లోపల సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. షిమనే ప్రిఫెక్చర్ రాజధాని మాట్సుతో పాటు టోటోరి ప్రిఫెక్చర్ పరిధిలోని పలు నగరాల్లో భూమి తీవ్రంగా కంపించింది. భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఆఫ్టర్ షాక్స్ వచ్చే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు హెచ్చరించారు.
Japan Earthquake
Japan
Earthquake
Shimane Prefecture
Chugoku Region
Matsue
Tottori Prefecture
Earthquake Today

More Telugu News