Maharashtra Farmers: పంట చేలల్లో కూలీలకు తుపాకులతో రైతుల కాపలా.. వీడియో ఇదిగో!

Farmers Protect Field Workers from Leopards in Maharashtra
  • మహారాష్ట్రలోని అహల్యనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చిరుతల సంచారం
  • వ్యవసాయ పనులకు వెళ్లడానికి భయపడుతున్న కూలీలు
  • కూలీలు పనులు చేస్తుంటే గస్తీ కాస్తున్న రైతులు
పంట చేలల్లో పనులు చేస్తున్న కూలీలకు ఓ రైతు తుపాకీతో కాపలా కాస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని అహల్యానగర్ లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణంగా మారాయని స్థానికులు చెబుతున్నారు. ఊరు చివర్లో ఉన్న పంట పొలాల్లోకి తరచూ చిరుత పులులు వస్తున్నాయని, మనుషులపై దాడులు చేస్తున్నాయని తెలిపారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని వివరించారు.

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పులుల భయం ఎక్కువగా ఉందన్నారు. ముఖ్యంగా ఖుద్సర్‌, పాథ్రే, మైగావ్, మంజరి ప్రాంతాల్లో ప్రస్తుతం 20 నుంచి 25 చిరుతలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని చెప్పారు. దీంతో కూలీలకు రక్షణగా రైతులు తుపాకులు పట్టుకుంటున్నారు. కూలీలు పనులు చేస్తుంటే తాము అప్రమత్తంగా కాపలా కాస్తున్నామని ఖుద్సర్ కు చెందిన ఓ రైతు పేర్కొన్నారు.
Maharashtra Farmers
Farmers Maharashtra
Leopard attacks
Crop fields
Agricultural Workers
Ahalyanagar
చిరుత పులులు
ఖుద్సర్
పాథ్రే
మంజరి

More Telugu News