Shiva Dhar Reddy: తెలంగాణలో మరో 17 మంది మావోయిస్టులు మాత్రమే ఉన్నారు: డీజీపీ

DGP Only 17 Maoists Remain in Telangana
  • 17 మంది లొంగిపోతే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా నిలుస్తుందని వెల్లడి
  • అందులో నలుగురు కేంద్ర కమిటీ, ఐదుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు వెల్లడి
  • ఆపరేషన్ కగార్ గడువుకు ముందే తెలంగాణ మావోయిస్టు రహితమవుతుందన్న డీజీపీ
రాష్ట్రానికి చెందిన మరో 17 మంది మావోయిస్టులు లొంగిపోతే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా నిలుస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారు 17 మంది మాత్రమే ఉన్నారని ఆయన వెల్లడించారు. వారిలో కేంద్ర కమిటీలో నలుగురు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్ గ్రౌండ్‌లో ఇద్దరు ఉన్నారని తెలిపారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారని ఆయన అన్నారు.

ఈ 17 మంది మావోయిస్టులపై మొత్తం రూ.2.25 కోట్ల రివార్డు ఉందని ఆయన చెప్పారు. వారంతా లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ఆపరేషన్ కగార్ గడువు లోపే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిస్తే పోలీసు శాఖ నుంచి వారికి అవసరమైన సహాయం అందుతుందని ఆయన అన్నారు.
Shiva Dhar Reddy
Telangana
Maoists
Naxalites
Surrender
Telangana Police
Operation Khagar
DGP

More Telugu News