మేనల్లుడి రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో కల్యాణ్ రామ్.. వీడియో ఇదిగో

  • కాకినాడలో రెస్టారెంట్ ప్రారంభించిన కల్యాణ్ రామ్ మేనల్లుడు 
  • ముఖ్య అతిథిగా హాజరైన కల్యాణ్ రామ్
  • మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన నందమూరి హీరో

ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి హరికృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కల్యాణ్ రామ్... తనదైన మార్క్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ను నడిపిస్తూ నిర్మాతగానూ, హీరోగానూ దూసుకుపోతున్నారు.


ఇటీవల 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'తో మరోసారి అభిమానులను అలరించిన కల్యాణ్ రామ్, ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా 'బింబిసార' మూవీ భారీ సక్సెస్ తర్వాత, దాని సీక్వెల్ 'బింబిసార 2'పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా పార్ట్ 2 కూడా గ్రాండ్‌గా తెరకెక్కనుంది. అదనంగా, పాప్యులర్ రైటర్ అయిన శ్రీకాంత్ విస్సా దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా లైన్‌లో ఉందని సమాచారం. శ్రీకాంత్ విస్సా ఇప్పటికే కల్యాణ్ రామ్‌కు కథ వినిపించారట. ఈ రెండు ప్రాజెక్టులతో కల్యాణ్ రామ్ మరోసారి బిగ్ హిట్స్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.


ఫ్యామిలీ మ్యాటర్స్‌లోనూ కల్యాణ్ రామ్ చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన ఒక ప్రైవేట్ ఫ్యామిలీ ఈవెంట్‌లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు. కాకినాడలో తన మేనల్లుడు కొత్తగా ప్రారంభించిన 'ఉదయ్ కేఫ్' రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి కల్యాణ్ రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయంగా రిబ్బన్ కట్ చేసి, రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో కల్యాణ్ రామ్ సింపుల్ లుక్‌లో కనిపించి, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



More Telugu News