Rohit Sharma: చెయ్యిపట్టుకుని లాగిన అభిమానులు.. హెచ్చరించిన రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో!

Rohit Sharma Warns Fans Over Selfie Enthusiasm Viral Video
  • కారులో వెళ్తున్న రోహిత్ శర్మతో సెల్ఫీ కోసం యువకుల ప్రయత్నం
  • ఫ్యాన్స్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన వెటరన్ ఓపెనర్
  • విజయ్ హజారే ట్రోఫీలో సిక్కింపై 155 పరుగులతో మెరిసిన రోహిత్
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కారులో వెళ్తున్న రోహిత్ వద్దకు ఇద్దరు చిన్నారులు వచ్చి సెల్ఫీ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో రోహిత్ కారు కిటికీలోంచి వారికి అభివాదం చేయడానికి చేయి బయట పెట్టగా, వారు ఆయన చేయి పట్టుకుని లాగడానికి ప్రయత్నించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రోహిత్ వారిని హెచ్చరిస్తూ వెంటనే కారు అద్దాలు మూసివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

రోహిత్ శర్మకు 2025 ఏడాది అత్యంత చిరస్మరణీయంగా నిలిచింది. గతేడాది ఆయన నాయకత్వంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అదేవిధంగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు (352) బాదిన ఆటగాడిగా షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న రికార్డును కూడా నవంబర్‌లో అధిగమించాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 355 వన్డే సిక్సర్లు ఉన్నాయి. గతేడాది 14 ఇన్నింగ్స్‌ల్లో 50 సగటుతో 650 పరుగులు సాధించి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

వన్డేల్లో అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ, రోహిత్ శర్మ గతేడాది మే నెలలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు స్వస్తి పలికి కేవలం వన్డేలపైనే దృష్టి సారించనున్నట్లు అప్పట్లో వెల్లడించాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న రోహిత్, సిక్కింపై 155 పరుగులు సాధించాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం సిద్ధమవుతున్నాడు.
Rohit Sharma
Rohit Sharma video
Rohit Sharma fans
Indian Cricket
Cricket selfie
Vijay Hazare Trophy
India vs New Zealand
ICC Champions Trophy
Rohit Sharma retirement
Mumbai Cricket

More Telugu News