Bhogapuram Airport: భోగాపురం కల సాకారం.. ల్యాండైన తొలి విమానం
- విజయవంతంగా పూర్తయిన వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్
- విమానంలో ప్రయాణించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- 96 శాతానికి పైగా పూర్తయిన ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు
- జూన్ 26న విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు
విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఇవాళ ఉదయం 10.15 గంటల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ ఇక్కడి రన్‌వేపై దిగింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్ తదితరులు ప్రయాణించారు.
అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు పనులు ఇప్పటికే 96 శాతం పూర్తయినట్లు నిర్మాణ సంస్థ జీఎంఆర్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని జూన్ 26న అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ ప్రాంతం నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.