MSVG: నేడే 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్.. నాన్‌స్టాప్ ప్రమోషన్లకు మెగా ప్లాన్

Mana Shankara Varaprasad Garu Trailer Launch Mega Promotion Plan
  • సంక్రాంతికి వస్తున్న చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'
  • నేడు తిరుపతిలో ఘనంగా సినిమా ట్రైలర్ విడుదల
  • ట్రైలర్ లాంచ్ తర్వాత 9 రోజుల పాటు నాన్‌స్టాప్ ప్రమోషన్ టూర్
  • తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిత్ర బృందం
  • ఈ నెల‌ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. సంక్రాంతి కానుకగా ఈ నెల‌ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సినిమాకు హైలైట్‌గా నిలవనున్న ట్రైలర్‌ను ఈరోజు తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్‌లో ఘనంగా విడుదల చేయనున్నారు.

ట్రైలర్ విడుదలతో ప్రచారపర్వాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు మేకర్స్ భారీ ప్రణాళిక రచించారు. తిరుపతి ఈవెంట్ మొదలుకొని, విడుదల తేదీ వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కవర్ చేస్తూ నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్, తాడేపల్లిగూడెం, అనంతపురం, వరంగల్, బెంగళూరులో ఈ టూర్ కొనసాగనుంది. ఇప్పటికే రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.

ఇటీవల సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి స్వామివారి సేవలో పాల్గొన్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 2 నిమిషాల 20 సెకన్ల నిడివితో రానున్న ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
MSVG
Chiranjeevi
Mana Shankara Varaprasad Garu
Anil Ravipudi
Sankranti Release
Telugu Movie Trailer
Mega Star
Shine Screens
Gold Box Entertainments
Bheems Ceciroleo
Tollywood

More Telugu News