Chiranjeevi: చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ రిలీజ్ రేపే!

Chiranjeevi Mana Shankara Vara Prasad Garu Trailer Release Tomorrow
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారైంది. రేపు (జనవరి 4) సాయంత్రం 4:05 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి తిరుపతిలోని ఎస్‌వి సినీప్లెక్స్‌లో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తిస్థాయి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. చిరంజీవి, వెంకటేశ్ తొలిసారి కలిసి నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరిన్ థ్రెసా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సుమారు 2 నిమిషాల 30 సెకన్ల నిడివితో ట్రైలర్‌ను కట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
Mana Shankara Vara Prasad Garu
Anil Ravipudi
Venkatesh
Nayanthara
Catherine Tresa
Sankranthi Release
Telugu Movie Trailer
Shine Screens
Gold Box Entertainments

More Telugu News