చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ రిలీజ్ రేపే!
- చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం
- సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు!
- జనవరి 4 సాయంత్రం తిరుపతిలో ట్రైలర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారైంది. రేపు (జనవరి 4) సాయంత్రం 4:05 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి తిరుపతిలోని ఎస్‌వి సినీప్లెక్స్‌లో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తిస్థాయి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. చిరంజీవి, వెంకటేశ్ తొలిసారి కలిసి నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరిన్ థ్రెసా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సుమారు 2 నిమిషాల 30 సెకన్ల నిడివితో ట్రైలర్‌ను కట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.