Kunamneni Sambasiva Rao: మోదీపై కూనంనేని వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కిషన్ రెడ్డి

Kishan Reddy Condemns Kunamneni Sambasiva Raos Comments on Modi
  • వ్యక్తిగత దూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్య
  • అంతర్జాతీయస్థాయిలో దేశం గౌరవాన్ని పెంచుతున్న నాయకుడు మోదీ అన్న కిషన్ రెడ్డి
  • ప్రధానిపై కూనంనేని అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్న కిషన్ రెడ్డి
రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరమని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యక్తిగత దూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలు హేయమైనవని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, దేశాభివృద్ధికి అహోరాత్రులు శ్రమిస్తూ, అంతర్జాతీయస్థాయిలో భారతదేశ గౌరవాన్ని పెంచుతున్న నాయకుడు మోదీ అని కొనియాడారు.

అలాంటి ప్రధానిపై కూనంనేని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దివాలాకోరుతనాన్ని బయటపెట్టాయని విమర్శించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కూనంనేని వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య విలువలపై, రాజకీయ వ్యవస్థపై ఏవగింపు కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీపై కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయకుండా, సభా మర్యాదలు పాటించేలా చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డి సభాపతిని కోరారు.

కాగా, కూనంనేని సాంబశివరావు శాసనసభలో మాట్లాడుతూ, మోదీ మైండ్‌ను టెస్ట్ చేయించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Kunamneni Sambasiva Rao
Kishan Reddy
Narendra Modi
CPI
BJP
Telangana Politics
Political Criticism

More Telugu News