Adinarayana Reddy: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

Adinarayana Reddys son arrested in Hyderabad drugs case
  • డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు
  • నానక్‌రామ్‌గూడలో ఈగల్ టీం దాడుల్లో పట్టుబడిన సుధీర్ రెడ్డి
  • డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించిన పరీక్షల్లో పాజిటివ్ ఫలితం
హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్ కావడం సంచలనం సృష్టిస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటుండగా అతడు పట్టుబడినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే, నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో తెలంగాణ పోలీసుల ప్రత్యేక విభాగమైన 'ఈగల్ టీం' ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుబడినట్లు సమాచారం. వెంటనే అతనికి అక్కడికక్కడే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. దీంతో పోలీసులు సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అనంతరం అతడిని నార్సింగి పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. సుధీర్ రెడ్డిని డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సుధీర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 
Adinarayana Reddy
Andhra Pradesh BJP
Drugs case
Hyderabad drugs
Sudheer Reddy arrest
Nanakramguda
Eagle Team
Narcotics
Drug test positive
Narsingi police

More Telugu News