Kalvakuntla Kavitha: సూర్యాపేట జిల్లాలో 'జనంబాట'.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత విమర్శలు

Kalvakuntla Kavitha Criticizes Revanth Reddy Government in Suryapet Janambata
  • తెలంగాణలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆగ్రహం
  • ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీత
  • కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని వ్యాఖ్య
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. 'జనంబాట'లో భాగంగా ఆమె సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో అభివృద్ధి పనులు జరగడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని ఆమె ఆరోపించారు. తన పర్యటనలో భాగంగా ఆమె వివిధ వర్గాల ప్రజలు, రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి పనులు ఎక్కడకక్కడే నిలిచిపోయాయని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధిలో తాను ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై దృష్టి సారించానని ఆమె అన్నారు. అర్వపల్లి మండలంలోని కేజీవీబీ స్కూల్‌ను పరిశీలించినట్లు తెలిపారు. గత ఏడాది తుపాను వచ్చి పాఠశాల మునిగిపోతే కలెక్టర్ వచ్చి పరిశీలించారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
Kalvakuntla Kavitha
Kavitha
Telangana Jagruthi
Revanth Reddy
Telangana Government
Janambata

More Telugu News