Garikapati Narasimha Rao: గరికపాటి, యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై స్పందించిన బాబు గోగినేని

Babu Gogineni Responds to Na Anveshanas Comments on Garikapati
  • గరికపాటిపై అన్వేష్ మాట్లాడింది సరైనదేనన్న బాబు గోగినేని
  • తాను మాట్లాడిన దానికి యూట్యూబర్ క్షమాపణ చెప్పారని గుర్తుచేసిన బాబు గోగినేని
  • అన్వేష్ కూడా నోరు అదుపులో పెట్టుకుని ఉండాల్సిందన్న బాబు గోగినేని
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాసకులు గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలపై, 'నా అన్వేషణ' యూట్యూబర్ అన్వేష్ స్పందనకు హేతువాది బాబు గోగినేని స్పందించారు. గరికపాటి మహిళల గురించి అనుచితంగా మాట్లాడారని, అది సరికాదని, అన్వేష్ ఆయనపై చేసిన విమర్శలు సమంజసమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

నటుడు శివాజీ మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై కూడా 'నా అన్వేషణ' అన్వేష్ స్పందించారు. ఆ సమయంలో శివాజీని, గరికపాటిని ఉద్దేశించి ఆయన విమర్శలు గుప్పించారు. దీంతో అన్వేష్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వివాదంపై బాబు గోగినేని స్పందిస్తూ, తాను చేసిన వ్యాఖ్యలకు 'నా అన్వేషణ' యూట్యూబర్ అన్వేష్ క్షమాపణ చెప్పారని, వివరణ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. విదేశాల్లో ఉండి మాట్లాడిన వ్యక్తిపై కేసులు పెట్టవచ్చా లేదా అనేది న్యాయ నిపుణులు తేల్చాల్సి ఉంటుందని ఆయన అన్నారు. విమర్శలు చేసే సమయంలో అన్వేష్ కూడాద సంయమనం పాటించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో, ప్రజలు ఆగ్రహంతో ఉన్నప్పుడు మాట్లాడే భాషపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురు మహిళలను అసభ్యకరంగా తాకాడని ఆరోపించారు. ఆ వ్యక్తి పేరును తాను వెల్లడించబోనని, స్వయంగా ఆ వ్యక్తి మీడియా ముందుకు వచ్చి తన తప్పును అంగీకరించాలని ఆయన సూచించారు.
Garikapati Narasimha Rao
Babu Gogineni
Na Anveshana
spiritual leader
criticism
controversy

More Telugu News