శ్రీశైలం పూజారి ఇంట్లో మరోసారి చిరుత సంచారం... వీడియో ఇదిగో!

  • శ్రీశైలంలో మరోసారి చిరుత పులి సంచారం
  • పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి ప్రవేశం
  • గతేడాది జనవరిలోనూ ఇదే ఇంట్లోకి వచ్చిన చిరుత
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపింది. పాతాళగంగ మెట్ల మార్గంలో నివాసముంటున్న పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటి ఆవరణలోకి శుక్రవారం తెల్లవారుజామున ఓ చిరుత పులి ప్రవేశించింది. సుమారు 2:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయింది.

విశేషమేమిటంటే, గతేడాది (2025) జనవరిలో కూడా సరిగ్గా ఇదే ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించింది. మళ్లీ ఏడాది తర్వాత అదే ప్రదేశంలో చిరుత కనిపించడంతో పూజారి కుటుంబసభ్యులతో పాటు స్థానికులు, భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సుమారు ఒకటిన్నర సంవత్సరాల వయసున్న ఈ చిరుత, ఇంటి ఆవరణలో మూడు నిమిషాలకు పైగా సంచరించి వెళ్లిపోయినట్లు ఫుటేజ్‌లో వెల్లడైంది. 


More Telugu News