ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. డ్రైవర్ సజీవ దహనం

  • అమరావతి -నంద్యాల జాతీయ రహదారిపై రంగారెడ్డి పల్లె గ్రామం వద్ద ఘటన
  • గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్న బొలెరో 
  • గాయాలతో బయటపడ్డ మరో వ్యక్తి
అమరావతి - నంద్యాల జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లా రాచర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి పల్లె గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనాన్ని బొలెరో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

తుని నుండి జీడిపప్పు లోడుతో అనంతపురం వైపు వెళ్తున్న బొలెరో వాహనం, ముందుగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ స్వామి (50) సజీవ దహనమయ్యాడు.

ఈ ప్రమాదంలో కందిపల్లి జయరామిరెడ్డి అనే వ్యక్తి స్వల్పంగా గాయపడగా, అతడిని 108 అంబులెన్స్‌లో గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రాచర్ల పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. 


More Telugu News