Krishna Vamsi: ఫ్రీగా సినిమా చూస్తూ.. అదే సినిమాను చంపేస్తున్నారు: కృష్ణవంశీ
- సినిమా రివ్యూలు రాసే వారిపై కృష్ణవంశీ ఫైర్
- నెగెటివ్ రివ్యూలతో సినిమాను చంపేస్తున్నారని మండిపాటు
- సినిమా లేకపోతే మీ బతుకే లేదని వ్యాఖ్య
టాలీవుడ్ లో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి, ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కొద్ది మంది దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. ఆయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు ఘన విజయాలను సాధించాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆయన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవలి కాలంలో కృష్ణవంశీ జోరు తగ్గింది.
మరోవైపు, ఏదైనా సినిమా విడుదల అయిన వెంటనే... రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్ని నెగెటివ్ రివ్యూలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి రివ్యూలు ఇచ్చే వారిపై కృష్ణవంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సినిమా థియేటర్లోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తుంటారని... ఇలాంటి వారిలో 90 శాతం మంది మూర్ఖులేనని కృష్ణవంశీ అన్నారు. టికెట్ కూడా కొనకుండా వీళ్లు ఫ్రీగా సినిమాలు చూస్తారని... వెంటనే రివ్యూలతో ప్రేక్షకులను భయపెట్టేస్తారని విమర్శించారు. వారం రోజులు ఆగితే ప్రేక్షకులు సినిమా చూస్తారని... ఈలోగానే ఆడియన్స్ ను వీళ్లు భయపెడతారని మండిపడ్డారు. సినిమా లేకపోతే మీ బతుకే లేదు... అదే సినిమాను ఎలా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సినిమా కోసం ఎంతో మంది కష్టపడతారని... వాళ్ల కష్టాన్ని తక్కువ చేయొద్దని అన్నారు.