బ్రహ్మానందం గారి గురించి నేను చెప్పేదే నిజం:'జబర్దస్త్' ఫణి!
- 'జబర్దస్త్'తో పేరు తెచ్చుకున్న ఫణి
- సినిమాలలో తగ్గిన అవకాశాలు
- సీనియర్స్ మనసులు గొప్పవని వ్యాఖ్య
- తన భార్య కోసమైనా తాను సక్సెస్ కావాలనే ఆకాంక్ష
సినిమా అనేది చాలా మందికి వినోదం. కానీ చిత్రపరిశ్రమలో ఉన్నవారికి సినిమానే జీవితం. ఇక్కడ అందరూ సక్సెస్ కోసమే వెయిట్ చేస్తుంటారు .. సక్సెస్ కొట్టడడం కోసమే పరిగెడుతూ ఉంటారు. అయితే అనుకోకుండానే ఆ రేసులో వెనుకబడినవారు బాధపడుతూ ఉంటారు. మళ్లీ శక్తినంతా కూడదీసుకుని పరిగెత్తడానికి తమవంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులలోనే 'జబర్దస్త్' ఫణి కనిపిస్తాడు.
తాజాగా 'ఐ డ్రీమ్' టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫణి మాట్లాడుతూ, "నా భార్య అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నా తరువాత ఇండస్ట్రీకి వచ్చినవారు సక్సెస్ అవుతుంటే, అలాంటి మంచి రోజులు నాకు ఎప్పుడు వస్తాయా అన్నట్టుగా నా వైపు చూస్తుంది. నా టాలెంట్ కి తగిన సక్సెస్ రాలేదనే బాధ ఆమె ముఖంలో నాకు కనిపిస్తూనే ఉంటుంది. నేను ఎదగడం చూడాలనే తన కోరిక తీరడం కోసమైనా నేను సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.
"సీనియర్ కమెడియన్స్ గా ఉన్న వాళ్లంతా కూడా మా అందరితో చాలా సరదాగా ఉంటారు. సెట్లో అడుగుపెట్టగానే ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. బ్రహ్మానందం గారి గురించి తెలియనివారు బయట చాలా మాట్లాడతారు. కానీ ఎవరు ఎలాంటి సాయం అడిగినా వెంటనే చేసే స్వభావం ఆయనది. ఎవరైనా కష్టం చెప్పుకోగానే వెంటనే 'చెక్' రాసి ఇవ్వడం నేను ప్రత్యక్షంగా చాలా సార్లు చూశాను. ఆయన ఎప్పుడూ కూడా తాను చేసిన సాయం గురించి చెప్పుకోరు అంతే" అని చెప్పాడు.