Ram Gopal Varma: దక్షిణాది సినిమాలను 'ధురంధర్' ఎడమ కాలితో వెనక్కి తన్నాడు: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma Comments on Dhurandhar Movie Success
  • సూపర్ హిట్‌గా నిలిచిన రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' మూవీ
  • ఇప్పటికే రూ. 1,100 కోట్లు వసూలు చేసిన సినిమా
  • పార్ట్-2 మిమ్మల్ని వణిికిస్తుందన్న రామ్ గోపాల్ వర్మ

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్ చిత్రం 'ధురంధర్' సూపర్ హిట్‌గా నిలిచింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 1,100 కోట్లు వసూలు చేసి, బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. 2025లో విడుదలైన భారతీయ చిత్రాలలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా 'ధురంధర్' రికార్డు సృష్టించింది.


ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా సినిమా క్రేజ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. ధురంధర్ మూవీ బాలీవుడ్ పై దక్షిణ సినిమాల ఆధిపత్యానికి గట్టి సమాధానం ఇచ్చిందని తెలిపారు. 2026లో విడుదల కాబోతున్న 'ధురంధర్ 2' మరింత పవర్‌ఫుల్ అనుభవంగా ప్రేక్షకుల ముందుకు రానుందని వర్మ ట్వీట్‌లో తెలిపారు.


వర్మ చెప్పిన వివరాల ప్రకారం, “బాలీవుడ్ పై సడెన్‌గా దూసుకువచ్చిన సౌత్ సినిమాల ఫైర్‌ను 'ధురంధర్' మూవీతో ఆదిత్య ధర్ తన ఎడమ కాలితో వెనక్కి తన్నాడు. ఇప్పుడు తన కుడి కాలుతో తన్నడానికి 'ధురంధర్ 2'ని రెడీ చేస్తున్నాడు. పార్ట్-1 మిమ్మల్ని భయపెట్టినట్లయితే, పార్ట్-2 మిమ్మల్ని వణికిస్తుంది” అని ఆయన అన్నారు.


ప్రేక్షకులు కూడా ఇప్పటికే 'ధురంధర్ 2' కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ 2026 మార్చి 19న విడుదల కాబోతోంది. హిందీతో పాటు దక్షిణాది అన్ని భాషల్లోనూ ఈ సినిమా ప్రదర్శనకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సీక్వెల్‌కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.

Ram Gopal Varma
Dhurandhar
Ranveer Singh
Aditya Dhar
Bollywood
South Indian Movies
Box Office
Dhurandhar 2
Movie Review
Indian Cinema

More Telugu News