విమానం కిటీకీ అద్దంపై పేరు చెక్కిన ప్రబుద్దుడు.. మండిపడుతున్న నెటిజన్లు

  • ఇండిగో విమానం కిటికీపై మాన్విక్ పేరు
  • పదునైన వస్తువుతో చెక్కిన ప్రయాణికుడు
  • ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టిన మరో ప్రయాణికుడు
పబ్లిక్ ప్లేసుల్లో పేర్లు రాయడం కొంతమందికి అలవాటు.. ఎక్కువగా పబ్లిక్ టాయిలెట్లలో ఇలాంటి రాతలు కనిపిస్తుంటాయి. అయితే, ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్యాసింజర్ కిటికీపై పేరు చెక్కి ఉండటం గుర్తించాడు. దానిని ఫొటో తీసి రెడిట్ లో పోస్టు చేసి.. ‘ఈ ఇడియట్ చేసిన పని చూడండి’ అంటూ కాప్షన్ జోడించాడు. పబ్లిక్ టాయిలెట్లు, పర్యాటక ప్రాంతాల్లోని కట్టడాల నుంచి కొందరి మూర్ఖత్వం విమానం కిటికీ వరకూ చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ విమానం కిటికీ పైన చెక్కిన ‘మాన్విక్ లేదా మాన్వి కె’ అనే పేరు ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది.

కాగా, ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని సూచించారు. కిటికీ అద్దంపై పేరు చెక్కాడంటే ఏదో ఒక పదునైన వస్తువును ఉపయోగించి ఉంటాడు, కానీ విమానంలోకి పదునైన వస్తువులను అనుమతించరు కదా ఇది ఎలా జరిగి ఉంటుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం ఇలాంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కామెంట్ లో కోరాడు. అయితే, కిటికీ అద్దంపై మరో ప్లాసిక్ షీట్ ఉంటుందని, సిబ్బంది తరచూ ఆ షీట్ ను మారుస్తుంటారు కాబట్టి ఆందోళన అక్కర్లేదని మరో నెటిజన్ చెప్పారు.


More Telugu News