ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఇద్దరు మృతి

  • విజయనగరం జిల్లా గణపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఘటన 
  • ఒడిశా నుంచి విశాఖపట్నం వైపుకు వెళ్తుండగా ప్రమాదం 
  • అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న వ్యాన్
  • మృతులు విశాఖకు చెందిన విజయకుమార్, దిశేష్‌లుగా గుర్తింపు
ఓ మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గణపతినగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. 

ఒడిశాలోని రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులను విశాఖకు చెందిన పొట్నూరు విజయకుమార్, దినేష్ లుగా గుర్తించారు. 

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News