శబరిమల క్షేత్రానికి మండల పూజ ఆదాయం రూ.332 కోట్లు

  • శబరిమలలో ముగిసిన మండల దీక్షా పూజలు 
  • 30.56 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారన్న ఆలయ బోర్డు చైర్మన్
  • భక్తులు సమర్పించిన కానుకల రూపంలోనే రూ.83.17 కోట్లు ఆదాయంగా వచ్చినట్లు వెల్లడి
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 41 రోజుల పాటు కొనసాగిన మండల పూజ శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిసింది. ఈ సమయంలో సుమారు 30.56 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ట్రావేన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్‌ వెల్లడించారు.
 
మండల పూజ సమయంలో ఆలయానికి మొత్తం రూ.332.77 కోట్ల ఆదాయం లభించిందని ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.35.70 కోట్లు పెరగడం విశేషమన్నారు. మొత్తం ఆదాయంలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలోనే రూ.83.17 కోట్లు వచ్చాయని, మిగిలిన ఆదాయం ప్రసాదాల విక్రయం, ఇతర వనరుల ద్వారా సమకూరినట్లు వివరించారు.


More Telugu News