మలేసియాలో ఆడియో వేడుకలో పార్టీ నినాదాలు.. వారించిన హీరో విజయ్

  • ఆడియో వేడుకలో రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని ఆంక్షలు
  • చేతి సంజ్ఞలతో సున్నితంగా వారించిన విజయ్
  • రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌కి 'జననాయగన్' చివరి చిత్రం
ప్రముఖ తమిళ నటుడు విజయ్ నటించిన 'జననాయగన్' చిత్రం ఆడియో విడుదల వేడుకలో టీవీకే పార్టీ నినాదాలు వినిపించాయి. అయితే ఆడియో విడుదల వేడుక కార్యక్రమంలో రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదన్న ఆంక్షల నేపథ్యంలో ఆయన అభిమానులను వారించారు.

'జననాయగన్' ఆడియో విడుదల కార్యక్రమం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరిగింది. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్‌కి ఇది చివరి చిత్రం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా విజయ్ వేదిక పైకి రాగానే అతనికి, పార్టీకి అనుకూలంగా నినాదాలు మార్మోగాయి. కొంతమంది 'టీవీకే.. టీవీకే' అని నినాదాలు చేయగా ఆయన సున్నితంగా వారించారు. ఈ వేదికపై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చేతి సంజ్ఞతో పేర్కొన్నారు. 


More Telugu News