బెంగాల్‌లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఎంతమంది ఉన్నారో బయటపెట్టాలి: తృణమూల్ ఎంపీ
- అక్రమంగా ఉంటున్న వారి వివరాలు బయటపెట్టాలన్న ఎంపీ అభిషేక్ బెనర్జీ
- గత ఎన్నికల్లో తృణమూల్ గెలిచినప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తోందని ఆరోపణ
- ఎస్ఐఆర్‌లో బెంగాల్‌లో 58 లక్షల ఓటర్లను తొలగించిన ఎన్నికల సంఘం
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ (ఎస్ఐఆర్) నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఎంతమంది అక్రమంగా ఉంటున్నారో ఎన్నికల సంఘం వివరాలు బహిర్గతం చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఆయన కోరారు. ఈ నెల 31న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి తాను ఢిల్లీకి వెళుతున్నట్లు ఆయన తెలిపారు.
బెంగాల్‌లో రోహింగ్యాలు ఉంటే వారి జాబితాను విడుదల చేయాలని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని ఆయన ఆరోపించారు. బెంగాల్ జనాభా 10.05 కోట్లు కాగా, ఎస్ఐఆర్ ప్రక్రియలో దాదాపు ఐదు శాతం మంది (58 లక్షలు) ఓటర్లను తొలగించారని ఆయన పేర్కొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేలా లక్షలాది మంది ఓటర్లను తొలగిస్తున్నారని తృణమూల్ ఆరోపిస్తోంది. వచ్చే వేసవి కాలంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్‌కు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా డిసెంబర్ 16న ప్రచురించారు. ఈ జాబితా నుంచి దాదాపు 58 లక్షల పేర్లను తొలగించారు.