ఏసీలో మంటలు... హైదరాబాద్‌లో రెండేళ్ల బాలుడు మృతి

  • కాచిగూడలోని సుందర్ నగర్‌లో ప్రమాదం
  • ఏసీలో మంటలు వచ్చినప్పుడు గదిలోనే ఉన్న బాలుడు
  • గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్ నగరంలోని కాచిగూడలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏసీలో మంటలు చెలరేగడంతో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. కాచిగూడ పరిధిలోని సుందర్ నగర్‌లో ఓ ఇంట్లో ఈరోజు సాయంత్రం ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఆ సమయంలో రెండేళ్ల బాలుడు గదిలో ఉన్నాడు.

మంటల కారణంగా తీవ్ర గాయాలపాలైన బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కాగా, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ జరగడమే కారణమని భావిస్తున్నారు. 


More Telugu News