ఓటీటీకి వచ్చేసిన కీర్తి సురేశ్ మూవీ!

  • 'రివాల్వర్ రీటా'గా కీర్తి సురేశ్
  • నవంబర్ 28న రిలీజైన సినిమా
  • క్రైమ్ కామెడీ జోనర్లో నడిచే కథ  
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్

కీర్తి సురేశ్ కి తమిళ .. తెలుగు భాషాల్లో మంచి క్రేజ్ ఉంది. అందువలన తమిళంలో ఆమె చేసిన సినిమాలు, తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తమిళంలో ఆమె చేసిన సినిమానే 'రివాల్వర్ రీటా'. చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమా, నవంబర్ 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. క్రైమ్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా, తెలుగులోనూ విడుదలైంది.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ తెరపైకి వచ్చేసింది. తమిళ .. తెలుగు భాషలతో పాటు, ఇతర భాషలలోనూ ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను పలకరించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'నెట్ ఫ్లిక్స్'వారు సొంతం చేసుకున్నారు. ఈ రోజు నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, రాధిక .. సునీల్ .. అజయ్ ఘోష్ కీలకమైన పాత్రలను పోషించారు.

 ఈ కథ విషయానికి వస్తే, పాండ్యన్ తిరుగులేని నాయకుడిగా నేర సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. తన సోదరుడిని హత్య చేసిన పాండ్యన్ ను అంతం చేయాలనే ప్రతీకారంతో నర్సింహా రెడ్డి ఉంటాడు. అందుకోసం మార్టిన్ ముఠాతో డీల్ కుదుర్చుకుంటాడు. అయితే ఈ లోగానే రీటా తల్లి కారణంగా పాండ్యన్ మరణిస్తాడు. ఫలితంగా రీటా .. ఆమె తల్లి ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 




More Telugu News