బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్య... ఖండించిన భారత్

  • గత వారం బంగ్లాదేశ్‌లో దీపు చంద్ర దాస్‌ హత్య
  • మైనారిటీలపై దాడులు ఆందోళన కలిగించే విషయమన్న భారత్
  • బంగ్లాదేశ్ ఎన్నికలు పారదర్శకంగా జరగాలని కోరుకున్న రణధీర్
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. గత వారం 25 ఏళ్ల దీపు చంద్ర దాస్‌ను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యను భారత్ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్‌లోని హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా ఇతర మైనారిటీలపై నిరంతర దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లో వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికలు పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. మూక దాడుల్లో ఇటీవల ఇద్దరు హిందూ మతానికి చెందిన వ్యక్తులు మరణించిన విషయం విదితమే. బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ నగరంలో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని హతమార్చిన ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.


More Telugu News