కదులుతున్న కారులో ఐటీ మేనేజర్‌పై సామూహిక అత్యాచారం!
- రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఘటన
- లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఘాతుకం
- నిందితుల్లో కంపెనీ సీఈవో, మహిళా ఎగ్జిక్యూటివ్
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. కొత్త సంవత్సరం వేడుకల అనంతరం ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ ఇచ్చిన తోటి ఉద్యోగులే ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీ మహిళా మేనేజర్‌పై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి సంబంధించి కంపెనీ సీఈవో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. డిసెంబర్ 20న ఒక ప్రైవేట్ హోటల్‌లో కంపెనీ తరఫున న్యూ ఇయర్ పార్టీ నిర్వహించారు. రాత్రి 1:30 గంటలకు పార్టీ ముగిసిన తర్వాత బాధితురాలు ఒంటరిగా మిగిలిపోవడంతో అదే కంపెనీ సీఈవో జయేశ్, మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ శిల్ప, ఆమె భర్త గౌరవ్ ఆమెను ఇంటి వద్ద దింపుతామని నమ్మబలికారు.
బాధితురాలిని కారులో ఎక్కించుకున్నాక దారిలో ధూమపానానికి సంబంధించిన పదార్థాలను కొనుగోలు చేసి ఆమెకు ఇచ్చారు. అది తాగిన కొద్దిసేపటికే బాధితురాలు స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో నిందితులు ముగ్గురూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆమెను ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు.
పూర్తిగా స్పృహలోకి వచ్చిన బాధితురాలు, తన ప్రైవేట్ భాగాలపై గాయాలు ఉండటాన్ని గమనించి పోలీసులను ఆశ్రయించింది. ఉదయపూర్ ఎస్పీ యోగేశ్ గోయల్ మాట్లాడుతూ.. బాధితురాలి మెడికల్ రిపోర్టులో అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. నిందితులు ముగ్గురిని (జయేశ్, గౌరవ్, శిల్ప) అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కేసులో కారులోని డ్యాష్‌క్యామ్ ఆడియో, వీడియో రికార్డింగ్‌లు కీలక ఆధారాలుగా మారాయి. ఘటన సమయంలో రికార్డైన సంభాషణలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ మాధురి వర్మ ఆధ్వర్యంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.