షేక్ హసీనా స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న హిందూ నేత

  • గోపాల్‌గంజ్‌–3 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న గోవిందా చంద్ర ప్రామాణిక్
  • స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటన
  • ప్రజా సమస్యలను లేవనెత్తేందుకే పోటీ చేస్తున్నట్టు వెల్లడి
బంగ్లాదేశ్‌లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాతినిధ్యం వహించిన గోపాల్‌గంజ్‌–3 నియోజకవర్గం నుంచి హిందూ నేత, న్యాయవాది గోవిందా చంద్ర ప్రామాణిక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన హిందూ మహాకూటమిలో కీలక సభ్యుడైనా... ఏ పార్టీకి చెందకుండా ప్రజా సమస్యలను స్వేచ్ఛగా లేవనెత్తేందుకే స్వతంత్రంగా బరిలో దిగుతున్నట్లు తెలిపారు.

దేశంలో హిందూ జనాభా తగ్గుతుండటం, మైనార్టీలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హిందూ నేత కీలక స్థానం నుంచి పోటీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగనుండగా, హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం కారణంగా ఆ పార్టీ ఎన్నికల్లో పాల్గొనలేదని తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది.


More Telugu News