అందరి అంచనాలు తలకిందులు.. ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడయింది ఈ కారే!
- 2025లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతీ డిజైర్
- ఎస్‌యూవీల హవాను తట్టుకొని అగ్రస్థానంలో నిలిచిన సెడాన్
- హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్‌లను వెనక్కి నెట్టిన డిజైర్
- టాప్-10 జాబితాలో ఆరు మోడళ్లతో మారుతీ సుజుకీ ఆధిపత్యం
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, 2025లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ మారుతీ సుజుకీ డిజైర్ సెడాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది (జనవరి-నవంబర్) అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది. ప్రముఖ ఎస్‌యూవీ మోడళ్లయిన హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్‌లను వెనక్కి నెట్టి డిజైర్ టాప్ ప్లేస్‌కు చేరుకోవడం విశేషం.
2025లో ఇప్పటివరకు 1,95,416 యూనిట్ల డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. గత 41 ఏళ్లలో ఒక సెడాన్ మోడల్ అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలవడం ఇది రెండోసారి మాత్రమే. దీని తర్వాత 1,87,968 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ క్రెటా రెండో స్థానంలో, 1,81,186 యూనిట్లతో టాటా నెక్సాన్ మూడో స్థానంలో ఉన్నాయి.
ప్రస్తుతం దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో ఎస్‌యూవీల వాటానే 55 శాతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సెడాన్ మారుతీ డిజైర్ కావడం గమనార్హం. ఈ జాబితాలో 6 ఎస్‌యూవీలు, 2 హ్యాచ్‌బ్యాక్‌లు, ఒక ఎంపీవీ మోడల్ ఉన్నాయి.
ఈ టాప్-10 జాబితాలో మారుతీ సుజుకీకి చెందిన 6 మోడళ్లు ఉండగా, టాటా మోటార్స్ నుంచి రెండు, మహీంద్రా, హ్యుందాయ్ నుంచి చెరొకటి ఉన్నాయి. జాబితాలో తర్వాతి స్థానాల్లో మారుతీ వ్యాగన్ ఆర్ (1,79,663), ఎర్టిగా (1,75,404), స్విఫ్ట్ (1,70,494), మహీంద్రా స్కార్పియో (1,61,103), మారుతీ ఫ్రాంక్స్ (1,59,188), బ్రెజ్జా (1,57,606), టాటా పంచ్ (1,57,522) ఉన్నాయి.
ఇటీవల జీఎస్టీ తగ్గింపు, పండుగ సీజన్ ఆఫర్లు, ఇయర్ ఎండ్ డిస్కౌంట్ల కారణంగా కార్ల ధరలు తగ్గడం వంటి అంశాలు అమ్మకాలు పెరగడానికి దోహదపడ్డాయి.