ఏపీలో బీఎల్వో, సూపర్‌వైజర్ల పారితోషికం పెంపు

  • బీఎల్‌వోల వార్షిక పారితోషికం రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్
  • బీఎల్‌వోల పారితోషికం రూ.6వేల నుంచి రూ.12వేలకు పెంపు  
  • బీఎల్‌వో సూపర్‌వైజర్ల పారితోషికం రూ.12వేల నుంచి రూ.18వేలకు పెంపు
ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌వో), బీఎల్‌వో సూపర్‌వైజర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి వార్షిక పారితోషికాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

తాజా ఆదేశాల ప్రకారం, బీఎల్‌వోలకు వార్షికంగా రూ.12 వేలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లకు రూ.18 వేలు చెల్లించనున్నారు. సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్/ఎస్ఆర్) లేదా ఇతర ప్రత్యేక డ్రైవ్‌లలో పనిచేస్తే బీఎల్‌వోలకు అదనంగా రూ.2 వేల ప్రత్యేక ప్రోత్సాహకం లభిస్తుంది. పూర్తి సంవత్సరం పనిచేసిన బీఎల్‌వోలకు పూర్తి పారితోషికం, కొద్ది నెలలు పనిచేసిన వారికి వారు పనిచేసిన కాలానికి అనుగుణంగా పారితోషికం చెల్లించనున్నారు.

ఎన్నికల సంఘం సూచనల మేరకు తీసుకున్న ఈ నిర్ణయానికి ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. ఈ మేరకు సీఈవో వివేక్ యాదవ్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో బీఎల్‌వోలకు వార్షిక పారితోషికంగా రూ.6 వేలు, సూపర్‌వైజర్లకు రూ.12 వేలు చెల్లించేవారు. ఇతర ప్రత్యేక డ్రైవ్‌లలో పనిచేస్తే రూ.1000 ఇచ్చేవారు. తాజాగా ఈ మొత్తాలను పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 


More Telugu News